New Life To You

భయపడకుడి, మీ కొరకు రక్షకుడు జన్మించెను!

సుమారు 2000 సంవత్సరముల క్రితం, ఈ ప్రపంచములో ఒక పెద్ద అద్భుతము జరిగినది. అవును! ఈ ప్రపంచమును సృష్టించి, కాపాడుచున్న దేవుడు, మనవలె ఒక సాధారణ మనిషిగా ఈ ప్రపంచములో జన్మించారు! అదృశ్యమైన దేవుడు, మనవలె ఒక మనిషిగా జన్మించుట అతిశయము కదా? దీనినే నేడు ప్రపంచమంతటా, “క్రిస్మస్ రోజు!” అని పండుగ జరుపుకొనుచున్నది. దేవుడు, ఎందుకు ఒక మనిషిగా జన్మించవలెను? ఇశ్రాయేలు దేశములో, ‘బెత్లహేము’ అనే ఒక చిన్న ఊరిలో దేవుడు ఒక మనిషిగా అవతరించారు, ఆ వార్తను దేవుని దూతలు ఈ లోక ప్రజలకు ప్రకటించారు.
” దావీదు పట్టణమందు (బెత్లహేమునందు) నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు.” (లూకా 2:11)
దీనిని చదువుచున్న స్నేహితుల్లారా, మీ కొరకే దేవుడైన యేసు, మనిషిగా జన్మించారు. “నా కొరకా?” అని ఆశ్చర్యపడుచున్నారా? అవును! మీ కొరకే! మిమ్మల్ని రక్షించుట కొరకే, యేసు రక్షకుడు జన్మించారు!

ఎందుకొరకు జన్మించారు?

పాపములచేతను, పాప అలవాట్లచేతను హృదయములోను, కుటుంబములోను, జీవితములో అన్ని వైపుల సమాధానమును కోల్పోయి కలతచెందుచున్న మిమ్మల్ని, పాపమునుంచి రక్షించి, పరిశుద్ధ జీవితమును మీకు అనుగ్రహించుట కొరకే యేసు రక్షకుడు జన్మించారు. రోగములచేత వాడిపోయి, వేదన పడుచున్న మిమ్మల్ని వ్యాధినుంచి రక్షించి, సంతోషకరమైన ఒక జీవితమును మీకు అనుగ్రహించుట కొరకే యేసు రక్షకుడు జన్మించారు.
కలత, కన్నీరు, అవసరతల మధ్యలో అంగలార్చుచున్న మిమ్మల్ని, శ్రమలనుంచి రక్షించి, ఆశీర్వాదకరమైన ఒక జీవితమును అనుగ్రహించుటకొరకే ఆశీర్వాదకరమైన యేసు రక్షకుడు జన్మించారు. మంచి రక్షకునిగా జన్మించిన యేసు క్రీస్తు, జీవితమును తన యవ్వనములోనే సిలువలో మరణించుటకొరకు తనను అనుగ్రహించుట అప్పగించుకొనెను. ఆ సిలువలో మన కొరకే యేసు యొక్క పాపములు, వ్యాధులు, రక్షకుడు జన్మించెను శ్రమలు అన్నింటిని మోసి పరిష్కరించెను. సిలువ మ్రానులో మూడు చీలలచేత కొట్టబడి, తన పరిశుద్ధతగల రక్తమును చిందించి, మరణించిన యేసే మిమ్మల్ని రక్షించగలరు.
“… యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రలనుగా చేయును.” (1 యోహాను 1:7) మీ కొరకు జన్మించి, మీ కొరకు మరణించి, మీ కొరకు సజీవముగా లేచిన యేసు క్రీస్తు, ఇప్పుడు మిమ్మల్ని రక్షించుట కొరకు మీ సమీపమున ఉన్నారు. ఈ యేసు రక్షకుడిని మీ హృదయములో అంగీకరిస్తారా? “యేసయ్యా, మీరు నా కొరకు ఈ ప్రపంచములో జన్మించి, నన్ను రక్షించుట కొరకు సిలువలో మరణించారు’ అని, నేను విశ్వసించుచున్నాను.
మిమ్మల్ని నేను హృదయములో అంగీకరించుచున్నాను. నా పాపములను క్షమించి, ఆశీర్వాదకరమైన జీవితమును నాకు అనుగ్రహించండి.” అని విన్నపము చెయ్యండి. యేసు మీ హృదయములోనికి వచ్చును! మీ జీవితమును మార్చును! నిజమైన సమాధానమును మీకు అనుగ్రహించును! ఈ యేసు రక్షకుడిని గురించి, ఇంకా ఎక్కువగా మీరు
తెలుసుకొనగోరినట్లయితే, మమ్మల్ని సంప్రదించండి. యేసు క్రీస్తు యొక్క జీవిత చరిత కలిగిన పుస్తకమును ఉచితముగా మీకు పంపిస్తాము.

மிகவும் பிரபலமான தலைப்புகள்

உங்கள் வாழ்வில் சமாதானம் வேண்டுமா
ஒரு மனோதத்துவ மருத்துவரிடத்தில ஒரு மனிதன் வந்தான்.
கட்டில் கிடையானவர் நடந்த அனுபவம்
அப்பொழுது எனக்கு வயது 14, என் இருதயம் வீங்கி, வலது கால் செயலற்றுப் போயிற்று.
கவலையினால் மனம் உடைந்து விட்டீர்களா
இன்று, கவலையில்லாத மனிதர்களை காண்பது அரிதாக இருக்கிறது!
Tamil
Scroll to Top